పాటల టపాలు

నాకిష్టమైన పాటలు కొత్తవి కొన్ని, పాతవి అన్నీ….

chahunga main thujhe నవంబరు 14, 2007

ప్రచురించిన వర్గము హిందీ పాటలు — kamesh @ 10:24 పూర్వాహ్నం

చిత్రం - దోస్తీ

గాత్రం - మహమ్మద్ రఫీ

 

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే నవంబరు 14, 2007

ప్రచురించిన వర్గము తెలుగు, పాత పాటలు — kamesh @ 10:17 పూర్వాహ్నం

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది

ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది

ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే

ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే

నీ గాజులు ఘల్లని మోగుతుంటె నా మనసు ఝల్లుమంటున్నది

నా మనసు ఝల్లుమంటున్నది …

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది

ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే

తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే

చిలిపి నవ్వులు చిందులు తొక్కి ..

చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గుముంచుకొస్తున్నది

నునుసిగ్గుముంచుకొస్తున్నది

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది

ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే

చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే

తీయని తలపులు నాలో ఏమో

తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తు ఉన్నవి

ఆహ తికమక చేస్తు ఉన్నవి

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది

ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి

మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి

పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది

పరవశమైపోతున్నది … ఆఆఆఆఆఆ… ఆఆఆఆఆఆఆ

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది

ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

చిత్రం తోడికోడళ్ళు

గాత్రం ఘంటసాల, సుశీల

పదం కొసరాజు

స్వరం మాస్టర్ వేణు

 

నా హృదయపు కోవెలలో … నవంబరు 12, 2007

ప్రచురించిన వర్గము తెలుగు, పాత పాటలు — kamesh @ 1:49 అపరాహ్నం

నా హృదయపు కోవెలలో . ……..

నా బంగరు లోగిలిలో ……….

ఆనందం నిండెనులే … అనురాగం పండెనులే….

నా హృదయపు కోవెలలో

 

మధువులు కురిసే గానముతో .. మమతలు నాలో పెంచితివే

సొగసును మించిన సుగుణముతో నా మనసును నిలువున దోచితివే ..

నా హృదయపు కోవెలలో

 

శాంతికి నిలయం నీ హృదయం నా ప్రేమకు ఆలయమైనదిలే

లక్ష్మీ సరస్వతి నీవేలే నా బ్రతుకున కాపురముందువులే ..

బ్రతుకున కాపురముందువులే

నా హృదయపు కోవెలలో

 

ఇంటికి నీవే అన్నపూర్ణగా ప్రతిరోజూ ఒక పండుగగా

వచ్చే పోయే అతిధులతో మన వాకిలి కళకళలాడునులే

నా హృదయపు కోవెలలో ………

నా బంగరు లోగిలిలో ……….

ఆనందం నిండెనులే … అనురాగం పండెనులే….

నా హృదయపు కోవెలలో …..

 

చిత్రం ఇద్దరు అమ్మాయిలు

గాత్రం ఘంటసాల, సుశీల

పదం ఆచార్య ఆత్రేయ

స్వరం కె.వి.మహదేవన్

 

నావికా ఎచటికోయి నీ పయనం సెప్టెంబరు 15, 2007

ప్రచురించిన వర్గము తెలుగు, లలితగీతాలు — kamesh @ 9:33 పూర్వాహ్నం

నావికా ఎచటికోయి నీ పయనం ఎచటికోయి నీ పయనం

నావికా ఎచటికోయి నీ పయనం ఎచటికోయి నీ పయనం

ఉదయమాయెనో లేదో …వదలిపోతివో చెలిమి

ఏ తీరమునకు పోదువో … ఏ తీరమునకు పోదువో

ఏ దీవిని చేరుదువో …

నావికా ఎచటికోయి నీ పయనం

సూటిగ చూచి చేరుటకా కోటి కిరణుని పట్టుటకా

కలిమి కూడ రమ్మనరాదా … కలిమి కూడ రమ్మనరాదా

కలసిమెలసి పోరాదా ….

నావికా ఎచటికోయి నీ పయనం

సంద్రములో నడి సంద్రములో అంతులేని వడి కెరటాలలో

చుక్కాని లేని నావలో ……ఓఓఓఓ ఆఆఆఆఆఆ …. చుక్కాని లేని నావలో

ఎచటికో .. నీవెచటికోయి

నావికా ఎచటికోయి నీ పయనం

ఎచటికోయి నీ పయనం

గాత్రం : ఘంటసాల వేంకటేశ్వరరావు

 

Paradeshiyon se akhiyan milana సెప్టెంబరు 15, 2007

ప్రచురించిన వర్గము హిందీ పాటలు — kamesh @ 8:56 పూర్వాహ్నం

 

మరల మరల పునరంకితం సెప్టెంబరు 15, 2007

ప్రచురించిన వర్గము పాత పాటలు — kamesh @ 8:51 పూర్వాహ్నం

కొన్ని అనివార్య కారణాలు, పరిస్ధితుల వలన చాలా కాలం నుంచి            ( సుమారు 3 నెలల నుంచి) ఏ టపాలు వేయలేక పోయాను.  ఈ రోజే  అంతర్జాలం  తెరచి ముందుగా  తెలుగు గుంపులోని  వందలాది లేఖలను  చాలా ఓపికగా ( లేకపోయినప్పటికీ, ఎరువు తెచ్చుకుని మరీ) చదివా.  పనిలో పనిగా Blog Statistics కూడా చూసా.  ఆశ్చర్యం !!!  ఈ మూడు నెలలలో కూడా నా బ్లాగు సందర్శకులు వస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు. పాటలు వింటూనే ఉన్నారు.

నేను ఒక్క పోస్టూ చేయని/చేయలేక పాయిన జూన్, జూలై, ఆగస్టు, ఇప్పటి వరకూ సెప్టెంబరు నెలల గణాంకాలు ఇలా ఉన్నాయి.

జూన్ - 152 సందర్శకులు

జూలై - 184 సందర్శకులు

ఆగస్టు - 184 సందర్శకులు

సెప్టెంబర్ - 119 సందర్శకులు ( ఇవాళ్టి వరకు)

అందుచేత ఒక కఠినాతి కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. అదేమిటంటే, ఓపిక ఉన్నా లేకపోయినా కనీసం వారానికి ఒక పోస్టయినా తప్పకుండా చేయాలని. అలాగని అల్లాటప్పా పోస్టులు కూడా చేయలేనీి పరిస్ధితి.

అందువలన ఎటువంటి పోస్టులు కావాలో చదువరుల నిర్ణయానికే వదిలేసి వారి నిర్ణయానుసారం పోస్టులు చేయాలని అనుకుంటున్నా.

మీ సూచనలు, సలహాలు, కోరికలు తప్పకుండా తెలియ చేస్తారని ఆశిస్తున్నా.

మరల మరల పునరంకితం ( ఈ బ్లాగుకి) అవుతున్న సందర్భంగా ఒక హిందీ పాటను వేస్తున్నా.

నేడే, ఈనాడే కరుణించె నన్ను నెటిజనులే …..